C

ENGLISH            

తెలుగు        

Calculate గణించు, లెక్కచేయు
Calculus కలన గణితము
Cartesian product కార్టీసియన్ లబ్దము
Certain events ఖచ్చిత లేక దృడ ఘటనలు
Cent వంద, నూరు
Centisimal system శతాంశమానము
Central processing unit కేంద్ర విధాన విభాగం
Centre కేంద్రము
Centre of the circle వృత్త కేంద్రము
Centre of the triangle త్రిభుజ కేంద్రము
Centroid గురుత్వకేంద్రము
Characterstics అభిలక్షణములు
Chart పటము
Chord జ్యా
Circle వృత్తము
Circuit వలయం
Circular measure వర్తులమానము
Circum centre పరివృత్త కేంద్రము
Circum circle పరివృత్తము
Circumference పరిధి, చుట్టుకొలత
Circumference of a circle వృత్తపరిధి
Class తరగతి
Class mark తరగతి మార్కు
Classical probability సాంప్రదాయక సంభావ్యత
Clauses షరతులు
Clockwise rotation సవ్యపరిభ్రమణం
Closure property సంవృత ధర్మము
Co domain సహ ప్రదేశము
Coefficient గుణకము
Coefficient matrix ఘుణన మాత్రిక
Collinear సరేఖీయము
Collinear points సరేఖీయ బిందువులు
Column నిలువ వరుస, దొంతి
Commission రుసుము
Common ఉమ్మడి
Common difference సామాన్య భేదం
Commutative property (law) స్థిత్యంతర ధర్మము, వినిమయ ధర్మము (న్యాయం)
Comparison సరిపోల్చడం
Compass వృత్తలేఖిని
Complement పూరకము
Complement law పూరక న్యాయం
Complementary angles పూరక కోణాలు (రెండు కోణాల మొత్తం 90º)
Complementary events పూరక ఘటనలు
Complementary set పూరక సమితి
Complex numbers సంకీర్ణసంఖ్య
Complex roots సంకీర్ణ మూలాలు (సాధనలు)
Composite function సంయుక్త ప్రమేయం
Composite numbers సంయుక్త సంఖ్య
Compound angles పూరక కోణములు
Compound interest చక్రవడ్డీ, సంయుక్త వడ్డీ
Compound or mixed statement సంయుక్త ప్రవచనము
Computing గణన
Concave పుటాకార
Concentric circles ఏకకేంద్ర వృత్తములు
Conditional clause నిబంధనలతో కూడిన షరతులు
Conditional statement నియత ప్రవచనము
Cone శంకువు, శంఖము
Conjecture పరికల్పన
Conjuction సముచ్ఛయము
Conjugate సంయుగ్మము
Connective సంయోజకము
Consecutive వరుసక్రమములో వచ్చు
Consequent పరపదము
Constant స్థిరాంకము, స్థిరము
Constant function స్థిర ప్రమేయం
Constant matrix స్థిర మాత్రిక
Constant sequence స్థిరశ్రేఢి
Construction నిర్మాణము
Contradiction విరోదాబాసం( విరుద్దత)
Contrapositive statement ప్రతివర్తిత ప్రవచనము
Control unit నియంత్రణ పరికరము
Converse విపర్యయము
Conversely విపర్యంగా
Converse statement విపర్యయ ప్రవచనము
Convex కుంభాకార
Co-ordinate axis నిరూపక అక్షము
Co-ordinate axes నిరూపక అక్షాలు
Co-ordinates నిరూపకములు
Co-ordinate geometry నిరూపక రేఖాగణితము
Corresponding angles సదృశ కోణాలు
Corresponding value సదృశ విలువ
Cost price కొన్న వెల
Counter example ప్రత్యుదాహరణ
Credit జమ
Cube ఘనము
Cubit మూర
Cuboid దీర్ఘ ఘనము
Cumulative frequency సంచిత పౌనఃపున్యము
Curve వక్ర రేఖ
Cyclic చక్రీయము
Cylinder స్థూపము