"HUMAN COMPUTER" SAKUNTALA DEVI

(NOVEMBER 4th 1939 - APRIL 21 st 2013)

Ms.Shakuntala Devi held a Guinness World Record for her lidhtening - speed calculations.

Among her distinctions was her ability to, given a date in the last century, mentally ascertain the day. 

In 1977, she calculated the 23rd root of a 201 digit number in just 50 seconds. In the same year in Dalla's she answered the cube root of 188138517 in less time than the the computer takes.

In  June 18, 1980  she multiplied two 13 digit numbers 7,686,369,774,870 & 2,465,099,745,779 given to her randomly by the Computer Department of Imperial College, London within 28 seconds.

She strove to simplify math for students and help them get over their math phobia. It is a pity that her techniques died with her.Her techniques to simplify math were not used by educational institutions.

She authored several books including Fun with Numbers, Astrology for You, Puzzles to Puzzle You, and Awaken the Genius in Your Child.

An indisputable child prodigy, Ms.Devi began to give public demonstrations of her math skills at the age of six years. But it was even earlier, when she was three, that her father - a trapeze artist and lion tamer - first discovered her genius.Her father, whohad rebelled against his orthodox Brahmin family's wish that he join a circus rather than become a temple priest, noticed his daughter's uncanny ability to memorise while teaching her a card trick. Impressed by her gift, he then travelled with Ms.Devi on road shows where she performed her mathematical feats. Ms.Devi, who had no formal education, had once described her ability as a 'gift'.

She died on 21st April 2013 Sunday 8.15 A.M at the age of 80 years due to respiratory problems, heart & kidney complications.

గణిత మేధావి శకుంతలాదేవి "హ్యూమన్ కంప్యూటర్"

1939 నవంబర్ 4  -  2013 ఏప్రిల్ 21
అతి క్లిష్టమైన లెక్కలను అలవోకగా చేస్తూ కంప్యూటర్‌ను సైతం ఓడించి హ్యూమన్ కంప్యూటర్ గా మన్ననలు అందుకున్న గణిత మేధావి శకుంతలాదేవి 1939 నవంబరు 4న బెంగుళూరులో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బెంగుళూరులోని  బసవనగుడి ప్రాంతంలో శకుంతలాదేవి నివసించారు. 
శకుంతలాదేవి ప్రతిభను ఆమె మూడేళ్ల వయస్సులో ఉండగానే తండ్రి గుర్తించారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందినప్పటికీ, ఆమె తండ్రి పూజారి జీవితాన్ని తిరస్కరించి సర్కస్‌లో ఇంద్రజాలికుడిగా పనిచేశారు. సర్కస్‌లో ట్రాపేజ్, టైట్‌రోప్, క్యానన్‌బాల్స్ వంటి ప్రదర్శనలు ఇచ్చేవారు. పేకాట సందర్భంగా మూడేళ్ల వయసులోనే ఆమెలో ఉన్న అద్భుత లెక్కల సామర్ధ్యాన్ని తండ్రి గుర్తించారు. పేకముక్కల్ని గుర్తించుకోవడం ద్వారా ఆమె తండ్రిపై అలవోకగా గెలిచేవారు.
తొలిసారిగా ఆరేళ్ల వయస్సులో యూనివర్సిటీ ఆఫ్ మైసూరులో తన గణాంక ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించారు. తరువాత రెండేళ్లకు అన్నామలై యూనివర్సిటీలో మరోసారి ప్రతిభ చాటారు.
గణిత శాస్త్రంలో ఇంత ప్రతిభ ఉన్నప్పటికీ తానెప్పుడూ శాస్త్రీయ పద్ధతుల్లో గణితాన్ని అభ్యసించలేదని శకుంతలా దేవి చెప్పేవారు. గణితం అంటే తప్పుడు అభిప్రాయం వల్లే చాలామంది భయపడతారని, దానిని ఒక సబ్జెక్టుగా చూడటంతోనే సమస్య వస్తుందని చెబుతుండేవారు. పుట్టినతేది నుంచి ఆహారం, శ్వాస తీసుకునేవరకు జీవితంలో ప్రతి అంశంలోనూ గణితం దాగి ఉందని చెప్పేవారు. పిల్లలకు గణితంలో శిక్షణ ప్రారంభించేందుకు ఆరేళ్ల వయస్సు సరైందనేవారు.
శకుంతలాదేవి 13 అంకెల సంఖ్యవరకూ కూడికలు, హెచ్చింపులు, భాగహారాలు, ఇలా ఏ గణిత సమస్యకైనా సెకన్ల వ్యవధిలోనే సమాధానం చెప్పేవారు.
1977లో 201 అంకెల నెంబర్‌కు 23వ రూట్‌‌ను ఆమె చెప్పగలిగారు.
అదే సంవత్సరం డల్లాస్‌లో 188138517 సంఖ్యకు క్యూబ్ రూట్ చెప్పడంలో ఓ కంప్యూటర్‌తో పోటీపడి మరీ గెలిపొందారు. అప్పటినుండి హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు గాంచారు.
జూన్ 18, 1980న రెండు 13 అంకెల సంఖ్యల(7,686,369,774,870 X 2,465,099,745,779) ను కేవలం 28 సెకన్లలోనే గుణించారు. ఈ ఫీట్‌తో గిన్నీస్ రికార్డు సృష్టించారు.
గత శతాబ్దంలోని ఏ తేదిని ఇచ్చినా... ఆ రోజు ఏ వారమో ఆమె చిటికెలో చెప్పేసేవారు.
ఎనభై ఏళ్ల వయసులోను శకుంతలాదేవి లెక్కల సామర్ధ్యం ఏమాత్రం తగ్గకపోవడం విశేషం.
శకుంతలాదేవి రచయిత్రిగాను ప్రతిభ చూపించారు. జ్యోతిష్యంలోనూ ప్రవేశం ఉంది. గణితం, జ్యోతిష్యం లపై " ఫన్ విత్ నంబర్స్ ", "ఆస్ట్రాలజీ ఫర్ యూ", " పజిల్స్ టు పజిల్ యూ", " మ్యాథబ్లిట్"  వంటి అనేక పుస్తకాలు రాశారు.