భాస్కరుడు (క్రీ.శ.1114 - 1185 )

               గణితశాన్త్రంతో ఎన్నో ప్రయోగాలు, చమత్కారాలు, శ్లోకాలు చేసిన మహనీయుడు భాస్కరాచార్యుడు. ఈయన మనదేశంలోనే జన్మించిన మహానుభావుడు. క్రీ.శ.1114 లో మహారాష్ట్ర ( ప్రస్తుతం) లోని పాటణ్ అనే గ్రామంలో జన్మించాడు.

               లెక్కలంటే కొందరికి ఇష్టం. కానీ చాలామందికి భయం. గణించేవి కాబట్టి లెక్కలకు గణితం అనీ, ఇందుకు సంబంధించిన శాస్త్ర్రానికి గణిత శాస్త్ర్రం అని పేరు. గణితశాస్త్రంలో మళ్లీ బీజగణితం, రేఖాగణితం, క్షేత్రగణితం, కలన గణితం వున్నాయి. వీటిలో మళ్లీ ఎన్నో శాఖలు వున్నాయి. లెక్కలు ఎన్నో చిక్కులతో కూడినది. అటువంటి వాటిని చమత్కారమైన పద్యాలలో ఇమిడ్చి, శ్లోకాల రూపంలో చెప్పడం భాస్కరాచార్యుని ఘనత చాలా అరుదైనది.

               భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణి, కరణ కుతూహలం అనే గ్రంధాలు రాశాడు. సిద్ధాంత శిరోమణిలో పాటీగణితం, బీజగణితం, గ్రహగణితం, గోళధ్యాయం అనే 4 భాగాలు వున్నాయి. వీటిలో కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం, వర్గం, వర్గమూలం, ఘనం, ఘనమూలం మొదలైన క్లిష్టమైన అంశాలను ఎన్నో శతాబ్దాల కిందటనే భాస్కరాచార్యుడు పొందుపరచడం విశేషం.

               

 క  / ఖ = మహత్తు (అనంతం) అనే భావన మొట్టమొదట గణితంలో ప్రవేశపెట్టిన కీర్తి భాస్కరాచార్యునిది.